వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*98మందికి వైద్య పరీక్షలు,
*మండల వైద్యాధికారి అరుణ్ కుమార్,
ఖానాపురం(జనం సాక్షి )
మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలనిమండల వైద్యాధికారి అరుణ్ కుమార్ అన్నారు. వైద్యాధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు బండ మీది మామిడి తండ గ్రామంలో ఏఎన్ఎం రాగం సునీత 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హైమా, ఏఎన్ఎంభార్గవి,ఆశలు పద్మజా, విజయ,సునీత, తదితరులు పాల్గొన్నారు.