వర్షాకాల వ్యాధులతో ఆరోగ్యశాఖ అప్రమత్తం
ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో ఉండాలి
నీటిని కాచి తాగడం మంచిదని సూచన
అమరావతి,జూన్11(జనం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, నీటి సంబంధిత వ్యాధులు ప్రబలుతుండటం సహజమే అయినా ఏటా ప్రజలు వీటి బారినర పడుతూనే ఉన్నారు.గ్రావిూణ ప్రాంతాల్లో వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. వర్షాకాలం మొదలవుతుందంటే చాలు వ్యాధుల భయం వెన్నాడుతుంది. ఎక్కువగా గిరిజన ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది. గుంటలు, చెలిమలు, చెరువుల్లో నీరు నిల్వ ఉండటం వంటి కారణాలతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏటా చర్యలు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తం కావడంలేదు. జాగ్రత్తలు తీసుకోవడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఏటా మలేరియా వ్యాధులు విస్తరిస్తున్నాయి. దోమల నివారణలో భాగంగా గిరిజన ప్రాంతాలు, గుర్తించిన మైదాన ప్రాంతాల్లో మందులు చల్లుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రతీ పంచాయతీకి ఆదేశాలు ఇస్తున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగైన స్థితిలో ఉంచాలని, నీటి పరీక్షలు నిర్వహించాలని, క్లోరినేషన్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది కూడా ఆయా పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా సంబంధిత సిబ్బందిని చైతన్యవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశాంరు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే తక్షణం అక్కడ శాంపిల్స్ సేకరించి, శిబిరాలు నిర్వహించడం, బ్లీచింగ్, క్లోరినేషన్, మురుగునీరు నిల్వలేకుండా చూడటం చేస్తున్నారు. ప్రజలు శుద్ధి చేసిన నీటిని తాగుతుండటంతో నీటి వల్ల వచ్చే వ్యాధులు తట్టుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ వల్ల కలిగే వ్యాధులు ప్రభావితం చేస్తుంటాయి. దోమలతో డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, మొదడువాపు వంటివ్యాధులు ప్రబలుతాయి. కలుషిత నీరు తాగడం వల్ల అతిసారం, కామెర్లు వంటివి వస్తాయి. వర్షాకాలంలో దోమలు అత్యంత క్రియాశీలకంగా ఉంటాయి. అందుకే దోమల లార్వాలను చంపడానికి ఆయిల్‌బాల్స్‌ను మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వేయమని సూచిస్తున్నారు. వర్షాకాలంలో పిల్లలకు తలెత్తే ప్రధానమైన బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ డిప్తీరియా. దీన్నే టాన్సిల్స్ అని కూడా అంటారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఇకపోతే పిహెచ్‌సిలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న జబ్బుకు అయినా ప్రయివేటు వైద్యులు, పీఎంపీలు, ఆర్‌ఎంపీలు, అర్హతలేని వారి వద్ద మందులు తీసుకుని డబ్బులు నష్టపోవద్దన్నారు. . ఉచితంగా వైద్యం, మందులు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలని వైద్యులను సంప్రదించాలని అన్నారు.