వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

ఎల్లారెడ్డిపేట: మండలంలోని పధిరలో సోమవారం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను మంగళవారం తహశీల్దార్‌ సుమ, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి పరిశీలించారు. నష్ట తీవ్రతను అంచనా వేశారు. నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులను ఆదుకోవాలని తెరాస యువజన విభాగం సిరిసిల్ల నియోజక వర్గ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.