వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి – అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు  రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

 

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి  జూలై 20 ::

వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్నందున, రైతులు, ప్రజలు అప్రమతగా ఉండి, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు వంటివి రైతులు తాకకుండా ఉండాలని, చిన్నపిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు గమనిస్తుండాలని ఆయన సూచించారు.చెరువులలో చేపలు పట్టే వారు జాగ్రత్తగా ఉండాల నీ,  వాహన దారులు వెళ్లే క్రమంలో స్లీప్ అయ్యే అవకాశము ఉంటుంది, హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ఉరుములు మెరుపులు వచ్చే క్రమంలో చెట్ల వద్ద రైతులు ఉండకూడదని,   ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.