వలసలపై చర్యలు తీసుకోరేం: సిపిఎం

అనంతపురం,నవంబర్‌21 (జనం సాక్షి)  : వెనుకబడిన అనంతపురం జిల్లా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది. జాతీయ ఉపాధి హావిూ పథకం నీరుగారుతోందని, పనులు లేకుండా వసలలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. దీనిని సక్రమంగా అమలు చేయలేకపోవడం వల్‌లనే కేరళ తదితర రాష్ట్రాలకు కూలీలు వలసలు పోతున్నారని అన్నారు. ఉపాధి హావిూ బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. దీనిపైనా చంద్రబాబు నోరు మెదడపడం లేదని విమర్శించారు. కూలీలకు బకాయిపడ్డ వేతనాలను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చాలాఏళ్ల తర్వాత కొంత మేరకైనా ఈసారి అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట చేతికొచ్చిందన్నారు. ఆ పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతోనైనా వేరుశనగ కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.