వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి-చెట్టుకోమ్మ సాయంతో ధరికి

ఆదిలాబాద్‌: జిల్లాలోని బెజ్జురు మండలంలోని కుక్కుడ వాగులో అదే గ్రామానికి చెందిన ఆలం చంద్రయ్య నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. సమయానికి దగ్గరగా చెట్టు కొమ్మ దొరకటంతో దాన్ని పట్టుకుని రెండుగంటల పాటు అలాగే ఉన్నాడు. ఆయన కేకలు విని అటువైపు పంట పోలాల్లో కలుపు తీస్తున్న కూలీలు చూసి గ్రామాస్థులను పిలుచుకుని వచ్చారు. ఈత వచ్చిన ముగ్గురు యువకులు వెళ్లి చంద్రయ్యను కాపాడారు.