వాగ్బట యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం
ఖిలా వరంగల్, ఆగస్ట్13(జనంసాక్షి);
వాగ్బాట యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని వాకర్స్ ఇంటర్నేషనల్ 303 రీజియన్ కౌన్సిలర్ తడక కుమారస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వాగ్బాట యోగ అండ్ వర్కర్స్ సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాన కార్యదర్శి మార్గం నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కుమార స్వామి గౌడ్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోగ్య సూత్రాలతో పాటు సామాజిక అంశాల పట్ల అవగాహనవంతులై ఉండాలన్నారు. వాకర్స్ అసోసియేషన్ లకు అవసరమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ఓపెన్ జిమ్ సౌకర్యాల ఏర్పాటుకు వాకర్స్ ఇంటర్నేషనల్ 303 సహకారం పొందాలని కోరారు. అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ 303 ఆధ్వర్యంలో వాకర్ సభ్యులకు అందిస్తున్న గుర్తింపు కార్డుల ప్రాముఖ్యతను వివరించారు. వాగ్బాట సంగం వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమాండ్ల మధు మాట్లాడుతూ సంఘం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం, సంఘ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి కుమారస్వామికి వివరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గుర్రపు రామచందర్, సభ్యులు గాదె శ్రీశైలం, బొడిగె సాంబయ్య, సుభాష్, మోహన్,గోపాల్, ఖాన్ సాబ్, కుమారస్వామి, కర్ణాకర్, కన్నయ్య, నవీన్ రెడ్డి రాంబాబు, చిన్న, వేణు, తదితరులు పాల్గొన్నారు.