వాగ్వాదాల మధ్య కొనసాగిన పోడు భూముల గ్రామసభ..

గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజ గౌడ్
జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల గ్రామసభ తీవ్ర వాగ్వివాదం  మధ్య కొనసాగింది. రెండు రోజుల క్రితం గ్రామస్తుల బహిష్కరణతో వాయిదా పడ్డ గ్రామసభను తిరిగి బుధవారం గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజా గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి   అంజయ్య ప్రేక్షక పాత్ర వహించగా, ఫారెస్ట్ అధికారులు ఎవరూ రాకపోవడంతో గందరగోళం నెలకొంది.  దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పట్టా కాగితాలు ఇవ్వాలని రైతులు వాగ్వాదానికి దిగారు. కావాలని టిఆర్ఎస్ నేతలకు మాత్రమే పట్టా సర్టిఫికెట్లు ఇస్తున్నారని మిగతా రైతులను పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.