వాటర్ గ్రిడ్ పాలంపేట గిరిజనులకు శాపమేనా !
కలుషిత నీటి ప్రవాహంతో విషజ్వరాల పాలవుతున్న గిరిజనులు
భారీ వాహనాల రాకపోకలతో అధ్వాన్నంగా రోడ్ల పరిస్థితి
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు
రోడ్డుపై చెట్లు వేసి నిరసన తెలిపిన గిరిజనులు
వెంకటాపూర్ (రామప్ప)అక్టోబర్20(జనం సాక్షి):-
వెంకటాపూర్ (రామప్ప) మిషన్ భగీరథ నీరు మూడు మండలాల ప్రజలకు త్రాగునీరు అందుతున్నాయో లేదో కానీ పాలంపేట గ్రామంలోని గిరిజనులకు శాపంగా మారుతోంది ..వివరాల్లోకి వెళితే మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అందుకోసం పాలంపేటలో ఫిల్టర్ బెడ్ ఏర్పాటుచేసి వెంకటాపూర్ ములుగు గోవిందరావుపేట మండలాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు.అయితే స్థానికంగా నివసించే గిరిజనులకు శాపంగా మారింది ఫిల్టర్బెడ్ ద్వారా వచ్చే కలుషిత నీరు గిరిజన నివాసాల ఇండ్ల ముందునుండి జీవనదిలా రోజూ ప్రవహిస్తున్నది అపరిశుభ్రమైన కలుషిత నీరు వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమలు ఈగలు నివాసాలుగా మార్చుకున్నాయి దీంతో స్థానిక గిరిజనులు వివిధ రకాల రోగాల బారిన పడడమే కాకుండా గతంలో విషజ్వరాలతో మరణించిన సందర్భాలు ఉన్నాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చూస్తాం చేస్తాం అనడమే తప్ప పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఫిల్టర్ బెడ్ వెళ్లే రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది చిన్న గల్లీ రోడ్డు నుండి భారీ వాహనాలు రాకపోకలు కొనసాగడంతో రోడ్డు కుంగిపోయి గుంతలమయంగా మారింది భారీ వాహనాలు రావడంతో దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు చూస్తున్నరే తప్ప పట్టించుకోకపోవడంతో స్థానికులు అందరితో కలిసి రోడ్డుకు అడ్డంగా చెట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.అధికారులు నిర్లక్ష్యం వీడి సైడ్ డ్రైనేజీలు ఏర్పాటుతోపాటు రోడ్డు మరమ్మతులు చేసి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేనిచో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకిరెడ్డి రామ్మోహన్రావు, వకుళాభరణం శ్రీనివాస్, కొలకాని నర్సయ్య, ఎడం ఎల్లారి,గంట నర్సింగం, చీడం పోశమలు,వెలుగొండ మార్కండేయ, రాచమల్ల రాజు, ఎడం సమ్మక్క, దేవల్ల అచ్చమ్మ, ఆక సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
4 Attachments • Scanned by Gmail