వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయింది: రఘువీరారెడ్డి
విజయవాడ: ఈశాన్య రుతుపవానలకు సంబంధించి వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయిందని మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద నీటమునిగిన పొలాలను కలెక్టర్ బుద్దప్రకాష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలను పసిగట్టే వ్యవస్థ వాతావరణశాఖ వద్ద లేదన్నారు. రాష్ట్రంలో 170 పునరావాస కేంద్రాల్లో 68 వేలమందికి ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 5.25 లక్షల హెక్టార్లలో పంట నీట మునిగిందని వివరించారు. అత్యవసర సమయంలో చెరుకట్టల మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరు చేసే అవకాశాన్ని కలెక్టర్లకు ఇస్తున్నాట్లు మంత్రి తెలియజేశారు.