వాల్తేరు వీరయ్య షూట్‌లో జాయిన్ అయిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో
రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. ఇదిలా ఉంటే ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు మెగాస్టర్ సినిమాలో కీలకపాత్ర కోసం ముస్తాబయ్యాడు. చిరు, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ జాయిన్ అయ్యాడు.
రవితేజ పాత్ర సినిమాలో కీలకమని ప్రచారం సాగుతుంది. దీనికోసం మాస్‌రాజ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ చిత్రంలో రవితేజకు భార్య కూడా ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. చిరు ఈ సినిమాలో అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బ్జడెట్‌తో తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుదల కానుంది. దీనితో పాటు టైగర్ నాగేశ్వరరావు, ధమాకా, రావణాసుర చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.