విఆర్ఏల సమ్మెకు తుడుం దెబ్బ నాయకుల మద్దతు.
సంఘీభావం తెలుపుతున్న తుడుం దెబ్బ నాయకులు.
బెల్లంపల్లి, అక్టోబర్7,(జనంసాక్షి)
రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 75 వ రోజుకు చేరుకుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 75 రోజులుగా విఆర్ఏలు సమ్మె చేపట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ సాంప్రదాయ అతిపెద్ద పండగ అయిన బతుకమ్మ, దసరా పండుగలకు విఆర్ఏల కుటుంబాలు తీవ్ర నిరాశ, నిస్పృహలతో జరుపుకున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో తుడుం దెబ్బ ఆదివాసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కమ్మరి భీమయ్య, నాయిని సాంబయ్య, విఆర్ఏ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.