వికట గణపతి గా అవతరించిన మహాగణపతి
(జనంసాక్షి) సెప్టెంబర్ 2
అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం కానాజీ గూడ డైరీ ఫార్మ్ రోడ్ లో మహాగణపతి మూడవరోజు అలంకరణలో భాగంగాపరమేశ్వరుడు మన్మధుని భస్మం చేసినప్పుడు సముద్రంలో పడిన నేత్రాంగిని నుండి జలంధరుడు ఉద్భవిస్తాడు. కటోర తపస్సు చేసి బ్రాహ్మణుమెప్పించి అనేక వరాలను పొందిన జలంధరుడు అతని భార్య తులసి ప్రతివాత్య మహిమ వల్ల మరింత బలవంతుడై ముల్లోకాలను బాధిస్తూ ఉండేవాడు. శివుడు అంతటివాడు కూడా అతనిని జయించలేకపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుని రూపంలో లక్ష్మి అంశ అయిన తులసి చేతకు చేరి పొందుకు అంగీకరించడంతో ఆమె ప్రతివ్యాతని కోల్పోయినది. వీరికి కామ అనేరాక్షసుడుజన్మించాడు.కామసూర్ యుడు
శుక్లాచార్యుని ద్వారా పంచాక్షరి మతో ప్రదేశాన్ని పొంది శివుని గురించి కటోర తప్పమరిచి బలం నిర్భయత్వం మృత్యుంజయత్వాన్ని వరాలుగా పొందాడు. కామసూరుడు మహాబలవంతుడై ముల్లోకాలను జయించి కామధీనం చేసుకొని అనేక దుష్కర్మలు చేయసాగాడు. అప్పుడు ముద్దుగల మహర్షి సలహాతో దేవతలు ఋషులు ఓంకారాన్ని జపించగా పాశం కుసములు ధరించి లడ్డుక వరదాస్తాముతో చతుర్భుజుడై మయూర వాహనంపై వికట వినాయకుని రూపంలో అవతరించి కామసూరిని జయించాడు. వికట గణపతి అవతారంలో ఉన్న మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని అర్క చుతపత్రాలతో పూజించి అటుకుల లడ్డూలు నైవేద్యం పెట్టి ప్రార్ధించినట్లయితే మనలోని దుష్కమం నశించి ఆర్థిక ఆరోగ్య సంతాన సమస్యలు నివారణ అవుతాయని మరకత శ్రీలక్ష్మి గణపతి దేవాలయ కార్యనిర్వాహక వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. అదేవిధంగా కరోనా కష్టకాలములో పేద ప్రజల కోసం అన్నదానమే మహాదానం అనే నినాదంతో మంచి దృఢ సంకల్పంతో సంవత్సర కాలంలో ప్రతిరోజు చిలకలగూడ చౌరస్తా లోని పేద ప్రజలకు అన్నదానం చేయడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నానని ఆలయ వ్యవస్థాపకులు పేర్కొన్నారు
.