వికలాంగుల రిలే నిరాహార దీక్ష

ఎల్లారెడ్డిపేట: పింఛను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 వరకు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.