వికలాంగుల సమస్యల పై ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలి
(ఈవినింగ్ న్యూస్ జహీరాబాద్ ) వికలాంగుల సమస్యల పైన ప్రతినెలలో ఒక రోజు ప్రజావాణి ఏర్పాటు చేయాలి అని వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సింలు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వికలాంగులందరికీ దళిత బంధు మాదిరిగానే వికలాంగుల బంధు ప్రవేశపెట్టాలి 2016 చట్టం వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది దీనిని పాటిష్టంగా అమలు చేయాలి అన్నారు.వికలాంగులపై దాడులు. మానసిక బాలికలపై అత్యాచారాలు అరికట్టాలి వికలాంగులపై దాడి చేసిన వారిపై శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి అన్నారు. వికలాంగులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి బ్యాక్ లా గు పోస్టులు భర్తీ చేయాలి అన్నారు.