విచారణ పేరుతో వేధించడం తగదు
నర్సంపేట, మే 26(జనంసాక్షి) :
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ విచారణపేరుతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటపట్టణ కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు నర్సంపేట-వరంగల్ రహదారిపై రాస్తారోకోను నిర్వహించడంద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలిసులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్ నాయకుడు కామిశేట్టి రాజు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జగన్‌పై ప్రభుత్వం కక్ష్య సాధింపు దోరణికి పాల్పడుతుదని ఆరోపించారు. జగన్‌కు ఉన్న ప్రజాధారణను చూసి ఓర్వలేకనే సిబిఐచే దాడులు , విచారణలు ముమ్మరంచేశారని పేర్కొన్నారు. జగన్‌కు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు అశోక్, కొమురయ్య, అప్జల్, తహీర్, ప్రభుదాస్, శ్రీనివాస్, సంతోష్, కుమారస్వామి,మల్లేశ్, రాహుల్, అనంతరెడ్డి, సందీప్, అనిల్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.