విజయమ్మ దీక్షపై స్పదించాల్సిన అవసరం లేదు

హైదరాబాద్‌: రాజకీయ దురుద్దేశంతో వైఎస్‌ విజయమ్మ చేపట్టిన దీక్షకు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చేనేతశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2008-09 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో 312 కోట్ల రూపాయలు చేనేత రుణమాఫికి కేటాయించిన వైఎస్‌ సర్కారు ఎంరుకు అమలు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చేనేత కార్మకుల ఆత్మహత్యలు బాగా తగ్గాయని ఆయన వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.53కోట్ల రూపాయల మేర రుణ మఫీ చేశామన్న మంత్రి మరో రూ.109కోట్ల రుణ మాఫీ దస్త్రాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.