విజయవాడలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదపుతున్నాయి. ఆదివారం విజయవాడ, కాకినాడలలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రామగుండం లో 44.6, నిజామాబాద్‌లో 43, కర్నూలు 41.9, తిరుపతి 41.8, హైదరాబాద్‌ 40.8, అనంతపురం 40.7, నెల్లూరు 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.