విజయవాడ: ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో యువతిపై అత్యాచారం

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలోగల నాని ఇంటర్నెట్‌ హైస్పీడ్‌ సెంటర్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన దారుణం శుక్రవారం బాధితురాలు ఫిర్యాదుతో వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్‌నెట్‌ నిర్వాహకుడితో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారిని అరెస్టు చేసి పోలీసులు కోర్టుకు తరలించారు.
ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన యువతీ బి పార్మసీ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల నిమిత్తం సమాచారం కొరకు ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వచ్చిన ఆమెపై నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఎన్టీటీపీఎస్‌ ఏ కాలనీకి చెందిన చప్పిడి సునీల్‌ కుమార్‌ (29) బలవంతంగా అత్యాచారానికి పాల్పడి వాటిని వీడియోలు చిత్రీకరించాడు. వాటిని చూపించి యువతిని బెదిరించి రెండు నెలలుగా పలు సార్లు నెట్‌ సెంటర్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని స్నేహితులు అదే నెట్‌లో తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్న ఇబ్రహీంపట్నంకు చెందిన మహితో వినోద్‌ (21), ఇర్లా నాగరాజు(22)ల ద్వారా వీడియోలు చిత్రికరించి వాటిని ఇతర స్నేహితులకు వాట్సప్‌ ద్వారా పంపించాడు. కొందరు యువకులు గుర్తించి యువతీ దృష్టికి తీసుకురావటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా అత్యాచారానికి పాల్పడి వీడియోలు చూపించి బయటపెడతామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతీ పేర్కొంది. విషయం తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరని మౌనంగా భరిస్తున్నట్లు తెలిపింది. పోలీసులను ఆశ్రయిస్తే వీడియోలు అందరికి పంపిస్తామని బెదిరించినట్లు తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

 

తాజావార్తలు