విజయవాడ చేరకున్న ఉమెన్ చాందీ
ప్రత్యేక హోదా కాంగ్రెస్‌కే సాధ్యమని వెల్లడి
విజయవాడ,జూన్12(జనం సాక్షి): ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ముందు నుంచి పోరాడుతున్నపార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మంగళవారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఉమెన్ చాంది అన్నారు.ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక ¬దా సాధ్యం కాదని ఉమెన్ చాందీ అన్నారు. ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆయన పార్టీ కోఆర్డినేషన్ కమిటీ నాయకులతో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ పార్టీలతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక ¬దా ఇస్తామని గతంలో గుంటూరు సభలో రాహుల్ గాంధీ చెప్పారని చాందీ గుర్తుచేశారు. ఆర్థిక కారణాల వల్లే చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారని అన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి రాలేదని చాంది చెప్పారు. ¬దా కోసం టిడిపి,వైసిపి ఆశించిన మేర కృషి చేయలేకపోయాయని అన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తెస్తానని చాందీ చెప్పారు. పార్టీని వదిలి వెళ్లిన నేతలంతా మళ్లీ చేరాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు పాల్గన్నారు.