విజేతలకు బహుమతులు అందించిన ఎస్ఐ ప్రభాకర్
రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి)
రుద్రంగి మండలం మానాల గ్రామంలో దుర్గా మండలి వద్ద చిన్నారుల డ్యాన్స్ ప్రోగ్రాం వ్యాసరచన పోటీ మరియు ఉపన్యాసం దుర్గ మండలి మరియు ఆలయ కమిటీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఇట్టి పోటీలలో గెలుపొందిన చిన్నారులకు రుద్రంగి ఎస్ఐ ప్రభాకర్ చేతుల మీదుగా పిల్లలకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.ఫస్ట్ ప్రైస్ సిద్ధి వినాయక మండలి గర్ల్స్ మరియు సెకండ్ ప్రైజ్ శివ జ్యోతి గ్రూప్ మరియు గంగోత్రి గ్రూప్ మిగతా నాలుగు గ్రూపులు చేసిన వారందరికీ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గామాత మండలి నిర్వాహకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.