విజ్ డమ్ హైస్కూల్
ఎన్ సి సి కాడెట్ లచే ఘనంగా జరిగిన పునీత్ సాగర్ అభియాన్
జనం సాక్షి : నర్సంపేట
ప్రపంచ నదీ దినోత్సవం సందర్భంగా పునీత్ సాగర్ అభియాన్ లో భాగంగా ఎన్ సి సి 10 (టీ) బెటాలియన్, వరంగల్ వారి ఆధ్వర్యంలో విజ్ డమ్ హై స్కూల్ ఎన్ సి సి క్యాడేట్లచే నర్సంపేట పట్టణంలో ప్రజలకు అవగాహన ర్యాలీ మరియు కరపత్రాల పంపిణీ చేసినట్లు పాఠశాల ఎన్. సి. సి ఎ ఎన్ ఒ ప్రశాంత్ కుమార్
తెలిపారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ నేడు ప్లాస్టిక్ అనేది మన జీవితంలో అంతర్భాగమైపోయిందని, మనకు అవసరమైన కిరాణా సామాన్లు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, హోటల్లోని వస్తువుల కొరకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ఉపయోగించడం జరుగుతుందని, వివిధ కార్యక్రమాలలో వినియోగించే త్రాగే నీటి బాటిల్లు, తినే ప్లేట్లు, గ్లాసులు సైతం ప్లాస్టిక్ వే నని, వీటిని నీటి పరివాహ ప్రదేశాలైన కాలువలు, నదులు, చెరువులలోనికి వదిలినప్పుడు జల కాలుష్యంతో పాటు చర్మవ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. రంగురంగుల ప్లాస్టిక్ కవర్ల, ప్లేట్ల తయారీలో కాడ్మియం, సీసం వంటి విషపూరితమైన ధాతువులను వినియోగించడం వలన వాటిలో ఆహార పదార్థాలను వేసినప్పుడు అవి కలుషితమవును. దీనివలన కడుపునొప్పి, క్యాన్సర్ వంటి విషపూరితమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషపూరితమైన ధాతువులు నీటిలో స్రవించడం వలన నీరు కలుషితమై జలచరాలు అంతరించే ప్రమాదం ఉంది. కావున ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని పట్టణ ఎస్ఐ లక్ష్మీ తెలిపారు.ప్లాస్టిక్ పదార్థాలను బహిరంగంగా పడవేయకూడదని, నీటిలో కలపకూడదని దీనికోసం సమాజంలోని ప్రతీ ఒక్కరు తమ విధిగా భావించి కృషి చేయాలని ఎన్ సి సి కాడెట్స్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్, S I లక్ష్మి, ప్రశాంత్ కుమార్, రియాజుద్దీన్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, రాజు, అశోక్, క్యాడేట్లు పాల్గొన్నారు.