విడుదలైన మధ్యాహ్న భోజన పథకం బిల్లులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మండలంలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లు కింద రూ.11,811,188, ఏజేన్సి గౌరవ వేతనం కింద రూ. 10.76 లక్షలు విడుదలైనట్లు ఎంఈవో దేవాజీ తెలిపారు. త్వరలోనే ఆయా ఏజేన్సీల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఆయన పేర్కోన్నారు.