విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి
కొత్తగూడ, మే 26(జనంసాక్షి) :
విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్ సూచించారు. శనివారం మం డలంలోని ఎదుళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్ర సదస్సు దండు ఉపేందర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవే త్తల సలహాల, సూచనల మేరకు పంటసాగు చేయాలన్నారు. ఎరువులు, పురుగు మందులు ఎక్కువ మోతాదులో వాడోద్దన్నారు. పత్తి పంట లలో బార్డర్, క్రాప్స్, ఆకర్షక పంటలు వేయడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ వైధ్యాధికారిమాట్లాడుతూ పశువులకు రోగ నిరోధక టీకాలు వేయించుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఇవోలు ఉపేంద ర్, నాగరాణి, డాక్టర్ బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, రమేష్, జడ్పీటీసి రమేష్, రాంచందర్, రాములు, సారమ్మ, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో….
ప్రతి ఒక్క రైతు సమగ్ర సస్యరక్షణను కాపాడుతూ సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలని వ్యవసాయ శాఖాధికారి జి.కృష్ణవేణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని లింగాపురం గ్రామంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్‌లో రైతులు మేలైన విత్త నాలను ఎంపిక చేసుకొవాలని సూచించారు. ఖరీ ఫ్ సీజన్‌లో వరి పంటకు ముందు పచ్చి రొట్ట, జీ లుగ, జనుము, పెసర వేయడం వలన భూసా ర ం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయా శాఖాధికారులు శ్రీనివాస్, కొమ్మాలు, రవి, సత్యం, ఏఈవో సాధన తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో…..
పత్తి విత్తనాలను గ్రామాల వారిగా పంపిణి చేయడం జరుగుతుందని మండల వ్యవసాయా శాఖాధికారి యాదగిరి తెలిపారు. శనివారం నర్సంపేట మండలంలోని మాధన్నపేట గ్రామంలో రైతు చైతన్య యాత్ర నిర్వహిఞచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్పేషల్ ఆఫీసర్, విఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఆదర్శ రైతుల సమీక్షంలో విత్తనాల సంబంధించిన జాబితాను తయారు చేసి విత్తనాను పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్ల, ఇంద్రాసేనారెడ్డి, బుచ్చినల్లు, సదానందం, గవర్‌సింగ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.