విద్యతో పాటు క్రీడలకు కేసీఆర్ సర్కారు పెద్ద పీట
8వ రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రారంభించిన మంత్రి అల్లోల అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు బోథ్ (జనంసాక్షి) నవంబర్ 09 విద్యతో పాటు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సాహిస్తూ వారిని అన్ని రంగాల్లో ముందుకు సాగేలా పక్కా ప్రణాళికతో కేసీఆర్ సర్కారు ముందుకు సాగుతోందిని రాష్ట్ర అటవి, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బోథ్ మండల కేంద్రములోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో బుధవారం 8వ రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడల పోటీలకు అతిథులు విద్యార్థినిలు మార్చ్ ఫాస్టుతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించి అద్వితీయంగా నడిపిస్తూ విద్యార్థులకు విద్య బుద్ధులతో పాటు శారీరక,మానసిక ఉల్లాసానికి పాటు పడుతూ,సమాజం మెచ్చుకోదగ్గ విద్య కుసుమాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని,ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనీ,ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను,అవకాశాలను అందిపుచ్చుకుని కన్న తల్లిదండ్రులకు,పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. విద్యతో పాటు ఆటల్లో విద్యార్థినులు రాణించాలన్నారు. తెలంగాణ రేపటి భవిష్యత్తు విద్యార్థులేనని వారు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర సాధన నాటి నుండి కేసీఆర్ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారన్నారు.గురుకుల పాఠశాలల రూపంలో ప్రభుత్వం ప్రతిభ ఉన్న విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తోందన్నారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో క్రీడా ఆణిముత్యాలు ఉంటారనీ ఇలాంటి క్రీడవేదికలు అలాంటి వారికి ప్రతిభవంతులు తమ సత్తా చాటేందుకు అవకాశం కల్పిస్తాయని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు బోథ్ వేదిక కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో స్థానిక సర్పంచ్ గొర్ల సురేందర్ యాదవ్,జడ్పీటీసీ రాజనాల సంధ్యారాణి ప్రసాద్,ఎంపీపీ తుల శ్రీనివాస్,జడ్పీ కో ఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్,ఏ.ఎమ్.సి ఛైర్మెన్ దావుల బోజన్న, మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్, నెరడిగొండ ఎంపీపీ సజన్,ఎంపీటీసీలు రజని,నారాయన్ రెడ్డి,ఆర్బిఎస్ అధ్యక్షులు నల్ల జగన్ మోహన్ రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత ,సిబ్బంది,మండల నాయకులు,కార్యకర్తలు,ఆయా మండలాల నాయకులు అన్నారు.