విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి.
–అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలను సీజ్ చెయ్యాలి.
—మౌలిక వసతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
తొర్రుర్:25 జూన్( జనంసాక్షి )
విధ్యాసంత్సరం ప్రారంభమైన తరుణంలో ప్రయివేట్ పాఠశాలలు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మలుచుకొని వేలాది రూపాయలు దండుకుంటున్నారని ఎస్సి విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పంతం విజయేందర్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వెలిశాల శ్యామ్ మహార్ అన్నారు. ఈ రోజు సమత కళాశాలలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ
ప్రయివేటు పాఠశాలల యాజమన్యాలు ఫిజు మెనూ పెట్టకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టను రాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు,అదేవిధంగా పుస్తకాలు,యూనిఫామ్,టై బెల్టులు,మెటీరియల్స్ పేరుతో, అక్రమంగా అధిక రేట్లకు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు,తక్షణమే ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా ఫీజు మెనూ పెట్టకుండా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని అన్నారు.లేని పక్షంలో ఆయా పాఠశాలలను గుర్తించి ఆ పాఠశాలల ముందు ఆందోళనలు కార్యక్రమాలుచేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బి.మధు,మవీన్,శ్రావణ్,సుధాకర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.