విద్యాపరంగా అభివృద్ది చెందాలి : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

స్వచ్చ్​ గురుకుల్​ కార్యక్రమం ముగింపు
పరిగి​ రూరల్, సెప్టెంబర్​ 11( జనం సాక్షి ) :
 చదువుకున్న వ్యక్తి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంద అశోక్ కుమార్ అన్నారు. స్వచ్ఛ గురుకులం ముగింపు కార్యక్రమంలో భాగంగా పరిగి విద్యారణ్య పురి గురుకులంలో విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరు విద్యాపరంగా అభివృద్ది చెందితేనే  వంద శాతం అక్షరాస్యత సాధించిన వారమవుతామన్నారు.
 తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక ప్రతి విద్యాభివృద్దికి కృషి చేస్తుందన్నారు. పేదలకు కూడా కార్పోరేట్​ విద్యాప్రమాణాలకంటే మెరుగైన విద్యను అందించేకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, కౌన్సిలర్లు చెరుపుల శ్రీనివాస్ పవర్, మునీర్, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవి, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు జాక్ రవికుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
11 పిఆర్​ జి 01లో స్వచ్ఛ్​ గురుకుల కార్యక్రమంలో ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ ముకుంద కుమార్