విద్యార్థి దశనుండే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 24:: ప్రతి విద్యార్థి దశ నుండి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ పేర్కొన్నారు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ ఇక అమృత మహోత్సవ మరియు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు విద్యార్థులు భద్రతపై తెలుసుకున్న విషయాలను కుటుంబీకులతో స్నేహితులతో పాలుపంచుకోవాలని కోరారు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు రోడ్డు భద్రత పై విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖన ముగ్గుల పోటీలు నిర్వహించగా పోటీలలో గెలిచిన విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రధానం చేశారు రోడ్డు భద్రతపై పాటించాల్సిన నియమ నిబంధనలు వ్యక్తిగత భద్రత ఇతరుల భద్రత పట్ల బాధ్యతగా ఉంటానని ప్రతి విద్యార్థి ప్రమాణం చేయాలని అందరిచే ప్రమాణం చేయించారు రోడ్డుపై జర జాగ్రత్త అనే వీడియో పాటను ప్రదర్శించి విద్యార్థులకు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రమాదాలకు గల కారణాలను వారికి కళ్లకు కట్టినట్లు సులువుగా అర్థమయ్యే విధంగా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ పాటకు అనుగుణంగా  విద్యార్థులతో డ్యాన్సులు చేయించారు
 8వ వార్డు కౌన్సలర్ లావణ్య దుర్గారెడ్డి గార్ల చేతుల మీదకు దాదాపు 150 మంది ప్రతిభ కనభరిచిన విధ్యార్దులకు బహుమతులను అందజేశారు. .  విధ్యార్దులతో రోడ్డు బద్రత పై పాటించాల్సిన నియమనిబంధనల మరియు నేను నా వ్యక్తిగత భదత్ర పట్ల ఇతరుల భదత్ర పట్ల భాద్యయుతంగా ఉంటానని విద్యార్థులచే ప్రమాణం చేయించి సంతకాలు చేయించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రోజెక్ట్ మేనేజర్ వెంకట రమణ గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రోడ్డు భద్రతపై అవగాహన కలిగిఉండాలని, కోరారు జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోడ్డుభదత్ర కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించేందుకు అనుమతించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్షియా తారనుమ్ మరియు విద్యార్థులకు పోటీలు నిర్వహించడానికి సహకరించిన కవిత, రజిత , రజిని , అలియా బేగం , లావణ్య మరియు కవిత ఉపాద్యయుని బృందానికి  కృతజ్ణతలు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్షియా తారనుమ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు  రోడ్డు భద్రత అవగహన కల్పించడమే కాకుండా విద్యార్థులలో ప్రతిభను గుర్తించాడనికి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసిన జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారిని అభినందించారు. అలాగే ” రోడ్డు పై జరజాగ్రత్త ” పాట రచయిత డేవిడ్ గారినీ, సింగర్ అమృత్ రావు గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్  వెంకట రమణ  పరంధామం, ప్రవీణ్ కుమార్ ఫౌండేషన్ ఇన్చార్జ్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు ,విధ్యార్థులు రక్షా సిబ్భంది ముఖేష్ భీమ్ రావు, రచయిత డేవిడ్, సింగర్ అమృత్ రావు  తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు