విద్యార్థి నాయకుడు వెంకట్‌ను గెలిపించాలి
హుజూరాబాద్,అక్టోబర్25 (జనంసాక్షి): అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్టాన్న్రి కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడిపించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా తెలంగాన ప్రజల ఐక్యతను చాటాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి బల్మూర్ వెంకట్‌ను గెలిపించాలన్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఈప్రాంత ప్రజలు చెబుతున్నారని అన్నారు. నిరుపేద విద్యార్థులను ముక్కు పిండి ఫీజులు వసూలుచేసిన ఘనత, ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.