విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ
కాగజ్‌నగర్: చిన్నారిచూపు పథకం కింద పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 1,038 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 166 మందికి కంటి చూపు సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో వీరందరికీ ప్రభుత్వం తరపున కంటి అద్దాలు మంజూరు చేయగా వాటిని మండల విద్యాశాఖాధికారి దేవాది విద్యార్థులకు పంపిణీ చేశారు.