*విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇవ్వాలి*
మునగాల, సెప్టెంబర్ 21(జనం సాక్షి): విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ గ్రామపంచాయతీ పరిధిలో ఇవ్వాలని మహాజన చైతన్య సమితి (ఎంసీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బండారు నాగరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ ఇంచార్జీ తహసిల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండారు నాగరాజు మాట్లాడుతూ, విద్యార్థులు పైచదువులు చదువుటకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అవసరమన్నారు. కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కొరకు మారుమూల గ్రామాల నుండి మండలానికి వచ్చి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు ప్రవేశాల కొరకు చివరి తేదీ కావడంతో క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ కార్యదర్శి ఇస్తే ఒకరోజులో తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ ప్రాసెస్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెమ్మది వెంకన్న, లక్ష్మి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.