విద్యార్థులకు క్రీడా పోటీలు
సికింద్రాబాద్, జనంసాక్షి: నగరానికి చెందిన రాజీవ్ స్పోర్ట్స్ అకాడమీ వివిధ వేసవి శిక్షణ శిబిరాల్లో సైక్తింగ్, స్కేటింగ్‌లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పోటీలను నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని శాప్ సైక్లింగ్ వెలడ్రోమ్‌లో మంగళవారం ఉదయం పోటీలను మాజీ ఐఏఎస్ అధికారి కేవి రమణాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో శాప్ ఆధ్వర్యంలో వివిధ స్టేడియంలను, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేశామని, అవి ఈ విధంగా ఉపయోగపడటం ఎంతో ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఛైర్మన్ ప్రసాద్, పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు పాల్గోన్నారు.