విద్యార్థులకు చైల్డ్ లైన్ అధికారి అవగాహన కార్యక్రమం

 బషీరాబాద్ అక్టోబర్ 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల లో చైల్డ్ లైన్  ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ అధికారి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎలాంటి సమస్య వచ్చిన1098కు కాల్ చేయాలని సూచించారు. తల్లి లేదా తండ్రి, తల్లి తండ్రి ఇద్దరు లేని పిల్లలకు హాస్టల్  వసతి కల్పించి, అడ్మిషన్ ఇప్పిస్తానని అన్నారు. పోక్షో గురించి అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఎం.ఈ.ఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రాప్ ఔట్ కాకుండా పిల్లలందరూ రెగ్యులర్గా పాఠశాలలకు వచ్చి నట్లయితే ఉపాధ్యాయులు బోధించే విద్యను అభ్యసించడానికి అను కూలoగా ఉంటుంది అన్నారు.పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా నాకు  సమాచారం అందించాలని అలాగే  మధ్యాహ్నం భోజనం అందరు విద్యార్థులు  భోజనం చేయాలని, అందరితో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హనుమంతు నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.