విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: కడియం

వరంగల్: ఐరన్ మాత్రలు వికటించి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వరంగల్ ఆర్‌జేడీ, డీఈవోలను ఆదేశించారు.