విద్యార్థులకు వాలీబాల్ నెట్ అందజేసిన పూర్వ విద్యార్థి
రుద్రంగి అక్టోబర్ 20 (జనం సాక్షి)
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి మరియు గ్రామ పూజారి చందు తను చదువుకున్న పాఠశాల కు ఎదో ఒక రకాంగ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు.ఉన్నత పాఠశాల మానాల లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వాలీబాల్ మరియు వాలీబాల్ నెట్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సమక్షంలో విద్యార్థులకు వితరణ చేశారు.అదేవిధంగా పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకవస్తే తనవంతు సహాయం చేస్తా అని చెప్పారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.