విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 13 దండేపల్లి మండలం.గూడెం పాత మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి స్కూల్ కిట్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ10 వ తరగితి ఫలితాల్లో 10 GPA సాధించిన ప్రతి విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ విద్యను అందిస్తామని రఘునాథ్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, గుండా ప్రభాకర్, తోడేటి హారి కృష్ణ, బందేల రవి గౌడ్, చుంచు గిరిధర్, ప్రశాంత్, వల్లంబట్ల వంశీ, వెంకటేష్, హరీష్, అంజి, లక్కీ, అజయ్, భరత్, రాజు, రంజిత్, చుంచు వెంకటేష్, గంగాధరి వెంకటేష్, ముత్తే ఉమేష్, బోట్ల సాయి, ముత్తే అనిల్, దార శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.