విద్యార్థులను, కవులను సన్మానించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్18 (జనంసాక్షి);
కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు కథ, యోగ, యక్షగానం, గిరిజన వేషధారణలో విద్యార్థులు నృత్యాలు  వంటి కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కళాకారులను, విద్యార్థులను, కవులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. కళాకారులకు శాలువాలు కప్పి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, వ్యాఖ్యాత మనోహర్, తాసిల్దార్ ప్రేమ్ కుమార్, జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.