విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని అలవర్చుకోవాలి
తొర్రూర్ ఆగస్టు 15 (జనం సాక్షి)
విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని అలవర్చుకోవాలని గుర్తురు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీత పిలుపునిచ్చారు. మంగళవారం పంద్రాగస్టును పురస్కరించుకొని విద్యాలయంలో మొదటగా మువ్వన్నెల జెండాను ఆమె ఎగరవేశారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని ఆమె తెలిపారు.పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలంటే ఓర్పు నేర్పు సహనం పట్టుదలతో విద్యను అభ్యసించినట్లయితే అనుకున్న గమ్యానికి సులభంగా చేరుకోవచ్చని ఆమె తెలియజేశారు.ఈ సందర్భంగా స్కూలుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు చక్కగా మార్చి ఫాస్ట్ నిర్వహించారు. అంతేకాకుండా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం గ్రామ ప్రజలను,విద్యార్థులను ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో సర్పంచ్ మోత్కూరి రవీంద్ర చారి,ఎంపీటీసీమాధవి, ఎస్ఎంసి చైర్మన్ శంకర్, వైస్ ప్రిన్సిపల్ నూరుద్దీన్ ఉపాధ్యాయులు రాజేష్,రవి,పూర్ణ, వెంకన్న,శ్రీను,రాధాకృష్ణ, యాకాంబరం నాగమణి,దేవకీ,రాధ, మాధవి,రజిత,సుమతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.