విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – జడ్పిటిసి డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి


హుజూర్ నగర్ నవంబర్ 18 (జనంసాక్షి): విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ హుజూర్ నగర్ జెడ్పిటిసి డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి చేతుల మీదుగా అందజేశారన్నారు. అనంతరం జడ్పిటిసి సైదిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలలో చెకుముకి టాలెంట్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని వారు ఆవిష్కరించారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని, విద్యార్థులు రాబోవు కాలంలో శాస్త్రజ్ఞులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధా దుర్గా, బేబీ రాణి, పతంజలి శాస్త్రి, సైదా నాయక్, జయమ్మ, షమీం, సిఆర్పి సైదులు, లక్ష్మీ నరసింహ చారి, నాగ లత తదితరులు పాల్గొన్నారు.