విద్యార్థులు భాగస్వాములు కావాలి
కరీంనగర్,ఆగస్ట్19 (జనం సాక్షి) : విద్యార్థులు హరితహారంలో భాగస్వాములు కావాలనీ, ఇందులో భాగంగా తమ ఇంటి ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు నిచ్చారు. మొక్కలు నాటితే రాబోయే తరానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈత, తాటి, కర్జూర చెట్లను నరికితే వారిపై కేసులు తప్పవన్నారు. ప్రతీ గ్రామానికి 40 వేల మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలన్నారు.