విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆర్డిఓ రాజేంద్ర కుమార్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని త్రివేణి హైస్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఎక్స్ పో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యులు కావాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ విశ్వనాథం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ బి.సత్యనారాయణ, డీసిఈబీ సెక్రటరీ టి.కళారాణి, పాఠశాల ప్రిన్సిపాల్ పి.హరి, డైరెక్టర్లు అప్పారావు,నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.