విద్యార్థులు మలిదశపోరుకు సిద్ధం కావాలి
కరీంనగర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉత్తర తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు అగ్రభాగాన నిలిచింది. విద్యార్థిలోకమేనన్నారు. విద్యార్థి ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుందని, రాష్ట్ర సాధన కోసం మరోసారి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కపట నాటకాలను విద్యార్థులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, స్థానికి సంస్థల, సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు బాసటగా నిలవాలని కోరారు.
మంగళవారం నుంచి నిర్వహించే బస్తీబాట కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, పార్టీలు అనేసరిస్తున్న ద్వరద్వ వైఖరిపై ఇంటింటా ప్రాచారం నిర్వహించాలన్నారు. సీమాంధ్ర పార్టీలను పాతరేసేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలుముల రాకేష్, పీచు మహేందర్‌రెడ్డి , గజ్జెల మోహన్, నాయకులు జక్కుల నాగరాజు , పొన్నం అనిల్‌గౌడ్, ఎం. పూర్ణచందర్, సుదగోని శ్రీనాథ్‌గౌడ్, పడాల సతీష్, బూషన్‌హరి, దేవేందర్‌రెడ్డి, అశోక్, అజయ్, మధుసూధన్, శ్రీకాంత్, వెంకటస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.