విద్యార్థులు మూఢనమ్మకాలు వీడనాడాలి,

 

-తహసిల్దార్ రవీందర్,

 

 

మల్లాపూర్ (జనం సాక్షి )ఆగస్టు ‌‌:27 విద్యార్థులు మూఢనమ్మకాలు వీడనాడాలని తహసిల్దార్ రవీందర్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం నందు  పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీలత అధ్యక్షతన విద్య అవశ్యకత- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసిల్దార్ రవీందర్, భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే విద్యార్థులు మూఢనమ్మకాలు వీడి సైన్స్ సైనికుల ముందుకు సాగాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దొంగ స్వాములు, భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దయ్యాలు భూతాలు మంత్రాల పేరుతో నిలువునా దోపిడీ చేస్తున్నారని. విద్యార్థులు ఏది నిజం ఏది అపోహ అని వాస్తవిక విషయం తెలుసుకోవాలని ఉన్నత చదువులతో తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మూఢనమ్మకాలపై ఇంద్రజాల ప్రదర్శన నరేష్ నిర్వహించారు. నీటిలో రంగులు సృష్టించడం, ఇసుక నుండి కాయిన్స్ తీయడం, నోట్లొ  మంటలు లేపడం, విద్యార్థి చేతిపై కిరోసిన్ తో కాల్చడం, ఇనుప చువ్వ నాలుకకు గుచ్చుకోవడం, వేపాకులపై నీటితో మంటలు లేపడం, ఉరితాడు మాయం చేయడం, లాంటి అనేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.