విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి చేరుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులకు ఆదేశించారు. గురువారం మండల కేంద్రం తోపాటు ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల హాజరు పట్టిక, విద్యబోధన తదితర సమస్యల పై ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు. వంటగది మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోని వసతి గృహాలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల ప్రత్యేక అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు స్వచ్ఛతకు మారుపేరుగా గురుకుల పాఠశాలలు ముందుండాలని, ప్రభుత్వం కల్పించే సదుపాయాలతో విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించి పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు ప్రాఖ్యతలు తీసుకురావాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే స్థానిక సర్పంచ్ జోగుల రవి కస్తూర్బాగాంధీ పాఠశాల ముందు పెద్దగొయ్యి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాగా సంబంధిత అధికారులతో గొయ్యకు సంబంధించి అంచనా వేసుకుని తీసుకువస్తే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ తిరుపతయ్య, రఘు, ఆసియా, తహసిల్దార్ సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.