విద్యార్థులే నవ సమాజ నిర్మాతలు
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది, ఆదర్శనీయమైనది
* చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు గత 20 ఏండ్ల నుంచి పోటీలు నిర్వహిస్తున్న హమీద్ షేక్ సేవలు నిరూపమానం
* వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం : డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్
మిర్యాలగూడ, జనం సాక్షి
విద్యార్థులే నవ సమాజ నిర్మాతలని జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత స్పోకెన్ ఇంగ్లీష్ టైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులను ఘనంగా సత్కరించి బహుమతులు ప్రదానం చేసిన కార్యక్రమంలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడారు. చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు గత 20 ఏండ్ల నుంచి పోటీలు నిర్వహిస్తున్న హమీద్ షేక్ సేవలు నిరూపమానమైనవని అభినందించారు. నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొని నిల్చోవాలంటే విద్యార్థుల్లో ప్రేరణ అత్యవసరమని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం ద్వారా లేఖనా సామర్థ్యాలు వృద్ధి చెందుతాయని సూచించారు. గత 20 ఏండ్ల నుంచి 20 వేలకు పైగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన మిత్రులు హమీద్ షేక్ ను ఈ సందర్భంగా మరోసారి అభినందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులను బాధ్యతయుత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే అని డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని సామాజిక మాధ్యమాల వైపునకు మళ్లించకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో ఆదిత్య హై స్కూల్ కు చెందిన విద్యార్థిని సిరి ప్రథమ స్థానంలో, మిర్యాలగూడ పబ్లిక్ స్కూల్ కు చెందిన ఏ.లావణ్య ద్వితీయ స్థానంలో, నేతాజీ మెమోరియల్ హై స్కూల్ కు చెందిన డి.మోతీలాల్ తృతీయ స్థానంలో నిలిచారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన ఈ చిన్నారులను జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ చేతుల మీదుగా జ్ఞాపికలు, పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పోగుల సందీప్, శ్రీనివాస్ రెడ్డి, పాపయ్య, యాదగిరి,రోహిత్, సాయి, వేణు, నూర్జహా, కావ్య, ఉమా,ఫిరోజా, పుల్లయ్య, సోమేశ్, రాజేశ్వరీ, లింగరాజు, వెంకటయ్య, జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.