విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్ధ్యాలను పెంచాలి

పానుగల్, జూన్ 27, ( జనం సాక్షి ): పాఠ్యాంశాల బోధనలో మెళకువలను ప్రదర్శిస్తూ విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్థ్యాల పట్ల ఆసక్తిని పెంచాలని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఉపాధ్యాయులకు సూచించారు .సోమవారం పానుగల్ మండల పరిధిలోని గోప్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, పానుగల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలను సందర్శించారు. 5,6,8 వ తరగతి విద్యార్థుల ఇంగ్లీషు, తెలుగు భాషల్లో చదవడం, రాయడం, మేథమెటిక్స్ బేసిక్ స్కిల్స్ పరిశీలించారు .ఈ సందర్భంగా అకడెమిక్ మానిటరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులను క్రమబద్దంగా పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకొని వారి హాజరు శాతాన్ని పెంచాలని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులలో గణిత పెంపొందించాలని సూచించారు. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ, ఇంగ్లీషు మీడియంలో బోధన, బడిబయటి పిల్లలను గుర్తించుట ,మనఊరు మనబడి తదితర అంశాలను సమీక్షించారు . గా అదేవిధంగా కు మెను పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ వో హేమలత మండల రిసోర్స్ పర్సన్ గోవిందు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు .