విద్యార్థుల లక్ష్యసాధనకు తోడ్పడాలి
– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ అక్టోబర్ 18 (జనం సాక్షి): విద్యార్థుల లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు తోడ్పడాలనీ హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ కోరారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ తో సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల తరగతి గదులను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పేద విద్యార్థులకు యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసి వారికి నాణ్యమైన విద్య అందిస్తుందని తెలియజేశారు. విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లెల ఉదయశ్రీ, తాతరాజు శ్రీనివాస్, లోకసాని శ్రీనివాసరెడ్డి, మాతంగి ప్రభాకర్ రావు, యరబోయిన ఉపేందర్ అన్వేష్, వెంకటేశ్వర్లు, జనార్దన్ రెడ్డి, సిఆర్పి సైదులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area