విద్యార్థుల సమస్యలను విస్మరిస్తున్న పాలకులు

 ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి )
ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక ,వైజ్ఞానిక, మానవియా విలువలు ఇచ్చే సాధన విద్య అని ఆ విద్యని నేటి పాలకవర్గాలు బ్రష్టు పట్టిస్తూ సమస్యలను నిస్మరిస్తున్నయని ప్రభుత్వ విద్యా పరిరక్షణకు అసమానలతో కూడిన నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆగస్టు 26, 27, 28 తేదీల్లో జరగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు

ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ నీ ఆవిష్కరించడం జరిగింది

ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ పరిష్కరించడంలో పూర్తి వైఫల్యం చెందాయని ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని అన్నారు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు అందులో భాగంగా కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యా కార్పొరేటీకరణ విద్యా కేంద్రీకరణ కాషాయకరణ చేయాలని చూస్తుందని అన్నారు చదువులపై జిఎస్టి బారము మోపుతూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పాఠశాలల కు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తు విద్య ప్రైవేటీకరణ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు విద్యాసంవత్సరం ప్రారంభం అయి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ రాలేదని అన్నారు దాదాపు రెండు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల విద్య సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానా ఇబ్బందులూ పడుతున్నారని పేర్కొన్నారు విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ చార్జీలను అధికంగా పెంచారని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీకి అడ్డు అదుపు లేదని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై , విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు 26,27,28వ తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే ఏఐఎస్ఎఫ్ మూడో రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని ఈ మహాసభలకు రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి 700 ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు అవుతారని ఈ మహాసభల విజయవంతానికి విద్యార్థులు కృషి చేయాలని మహేందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి మచ్చ రమేష్ ,కసిరెడ్డి మణికంఠ రెడ్డి,జిల్లా ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్,రామారాపు వెంకటేష్, కొంకటి ప్రశాంత్, నాయకులు ప్రణయ్,సందీప్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.