విద్యావలంటీర్ల సమావేశం
కెరమెరి: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం మండలంలోని విద్యావలంటీర్ల సమావేశం నిర్వహించారు. గత నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంపై అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావలంటీర్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు బాలాజీ అన్నారు. తమకు నెలనెలా కచ్చితంగా జీతాలు అందజేయాలని డిమాండ్ చేశారు.