విద్యా పటిష్టానికి తెలంగాణ సర్కారు కృషి

అదనపు తరగతి గదులు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ సర్కారు పటిష్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబిత ఇంద్ర రెడ్డి తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా పరిషత్ హైస్కూల్ లో టెక్నిప్ ఎఫ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు తరగతి గదులను కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేజీ టు పీజీ విద్యా అమలు చేయించిన ఘనత సిఎం కేసీఆర్ కే దక్కుతుందని, సర్కారు బడుల బలోపేతం కోసం కూడా అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు. మన ఊరు మన బడికి కూడా విశేష స్పందన లభించిందని తెలిపారు. ప్రజలందరి సహకారంతో భవిష్యత్ లో మరింత ఉన్నతమైన దిశగా సర్కారు బడులను ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. ఈ  కార్యక్రమంలో  మాజి జడ్పీటిసి సభ్యులు, బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, బిఎంసి మేయర్ సామల బుచ్చి రెడ్డి, టెక్నిప్ ఎఫ్ఎంసి డైరెక్టర్ తివారి, బిఎంసి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, పార్టీ జనరల్ సెక్రటరీ మీసాల కృష్ణ, సీనియర్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area